Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వినీదత్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో రిస్క్ తీసుకొని తెరకెక్కించిన సినిమా. అయితే ప్రభాస్ కంటే ముందు ఈ బ్యానర్ లో అశ్వనీదత్ .. డార్లింగ్ పెదనాన్న కృష్ణంరాజుతో 80లలో ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కించారు.
Kalki 2898 AD: సి.అశ్వనీదత్ టాలీవుడ్ అగ్ర నిర్మాతగా తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించిన ఘనత అశ్వనీదత్ కు దక్కుతుంది. అప్పటి అన్న ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి తొలి, సెకండ్ జనరేషన్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు.
ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంటటేష్ రజినీకాంత్ వంటి హీరోలతో కూడా బిగ్ బడ్జెట్ మూవీస్ లను తెరకెక్కించారు అశ్వినీదత్.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రెజెంట్ యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు అశ్వనీదత్ సొంతం. ఈ జనరేషన్ బిగ్ హీరోస్ లతో ప్రభాస్ తో తొలిసారి ‘కల్కి 2898 AD’ మూవీ తెరకెక్కించారు.
కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హీరోలు తొలిసారి వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నటించారు.
అయితే.. 1980లలో కృష్ణ, కృష్ణంరాజులతో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అడవి సింహాలు’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో తెరకెక్కించారు.
అయితే హిందీలో మాత్రం జితేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా ‘జానీ దోస్తి’ టైటిల్ తో ఈ సినిమాను కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. ఈ రెండు సినిమాలను దాదాపు ఒకే సమయంలో విడుదల చేసారు.
ఈ రెండు చిత్రాలు అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసాయి. ఇక కృష్ణంరాజు కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ తొలి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం.