schools and colleges holidays: దీపావళి తర్వాత మళ్లీ విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అని చెప్పుకొవచ్చు. ఇప్పుడు మళ్లీ వరుసగా ఆరు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు హలీడేలు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొన్నిరోజులుగా విద్యార్థులకు స్కూళ్లకు, కాలేజీలు కంటీన్యూగా సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది మాత్రం ఒకవైపు ఎంజాయ్ చేస్తున్న కూడా మరొక వైపు సిలబస్ లు పూర్తి కావట్లేదని బెంగ పెట్టుకున్నట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం తల్లిదండ్రులు సైతం తమ పిల్లల మీద బర్డెన్ పడుతుందని, కొందరైతే హలీడేలు వద్దని అంటున్నారంట. కానీ ప్రభుత్వాలు మాత్రం.. యథాప్రకరం హలీడే షెడ్యూల్ ను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరల స్కూళ్లు, కాలేజీలకు వరుసగా హలీడేలు రానున్నాయి.
కర్ణాటకలో వరుసగా ఆరురోజుల పాటుకంటీన్యూగా సెలవులు ఉండనున్నాయి. గతంలో ఒక వైపు వర్షాల కారణంగా కూడా.. స్కూళ్లకు బంద్ లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మల్లీ బంద్ లు ఉండనున్నాయి. ఈరోజు నుంచి అంటే.. నవంబర్ 13 నుంచి 18 వరకు బంద్ లు ఉన్నట్లు సమాచారం.
నవంబర్ 13 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. ఈ ఏడాది క్యాలెండర్ చూస్తే నవంబర్ 13న కార్తీక మాసంలో తులసి పూజ ఉంటుంది. ఇది దీపావళి తరువాత జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ కారణంగా తులసి పండుగ రోజున చాలా విద్యాసంస్థలు మూతపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అదే విధంగా.. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చాలా పాఠశాలల్లో తరగతులు నిర్వహించరు. బదులుగా, అనేక యాక్టివిటీస్ జరుగుతాయి. నవంబర్ 15న గురునానక్ జయంతి, నవంబర్ 16 శనివారం కావడంతో ఆఫ్ డే క్లాసులు జరగనున్నట్లు తెలుస్తొంది.
ఆ తర్వాత నవంబర్ 17 ఆదివారం కావడంతో యథావిధిగా సాధారణ సెలవు ఉంటుంది. నవంబర్ 18న కనకదాసు జయంతి కావడంతో ఆ రోజు కర్ణాటకలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 13 నుంచి 18 వరకు కర్ణాటక సహా దేశంలోని పలు పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నట్లు సమాచారం.