Liquor shops closed: లిక్కర్ షాపుల ఓనర్స్ సీరియస్ అయినట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆబ్కారీ అధికారులు.. షాపుల యజమానులు భారీగా లంచంను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల 20న లిక్కర్ షాపులు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
సాధారణంగా చాలా మంది లిక్కర్ కు తెగ అలవాటు పడిపోయి ఉంటారు. కొంత మంది ఏదైన అకేషన్ వేళ లిక్కర్ తాగితే.. మరికొందరు మాత్రం వేళ పాళ లేకుండా.. ఫుల్ జోష్ గా రోజు మందు పార్టీలు చేసుకుంటారు.
ఇంకొందరు తెల్లరగానే లిక్కర్ షాపుల ముందుకు వెళ్లి షాపు ఎప్పుడు తెరుస్తారో అని ఎదురు చూస్తుంటారు. అంతే కాకుండా.. పట్టపగలే.. మందు కొట్టి రోడ్డు మీద తూలుతూ హల్ చల్ చేస్తుంటారు.
లిక్కర్ షాపులు ఇటీవల కాలంలో ప్రభుత్వాలకు కాసులు కురిపిస్తున్నాయని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా..ప్రభుత్వాలు కూడా ఇష్టమున్నట్లు మద్యం బ్రాండ్లపై రేట్లు పెంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
లిక్కర్ ను ఆదాయ వనరుగా భావించకూడదని చాలా మంది ఫైర్ అవుతున్నారు. కొంత మంది లిక్కర్ బానిసల వీక్ నెస్ ను అడ్డం పెట్టుకుని భారీగా డబ్బులు సైతం వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో లిక్కర్ యజమానులు సీఎం సిద్దరామయ్య సర్కారుకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
కొన్ని చోట్ల ఆబ్కారీ అధికారుల లంచాలు ఇవ్వాలని వేధిస్తున్నారని దీనిపై సీఎం సిద్దరామయ్య సర్కారు ఎన్నిసార్లు చెప్పిన కూడా పట్టించుకొవడంలేదని కూడా వాపోతున్నారు. దీంతో చేసేది లేక.. ఈ నెల 20న కర్ణాటక వ్యాప్తంగా ఒక రోజు బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు.
తమ లిక్కర్ షాపుల బంద్ లో ఒక రోజులో కనీసం.. 130 కోట్ల ఆదాయం వరకు ప్రభుత్వంకు నష్టం వస్తుందని కూడా లిక్కర్ షాపుల సంఘం హెచ్చరించినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం వెంటనే ప్రభుత్వం దిగిరాకపోతే తమ బంద్ కొనసాగుతుందని కూడా లిక్కర్ సంఘం నేతలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.