KCR Admitted in Hospital: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ!

KCR Admitted in Hospital: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఎంపీ సంతోష్ కుమార్, కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తదితరులు ఆస్పత్రికి విచ్చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు మీకోసం.. 
 

  • Mar 11, 2022, 13:10 PM IST

  

1 /6

స్వల్ప అస్వస్థత కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు.   

2 /6

వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి లోపలికి ఆయన నడుచుకుంటూ వెళ్లారు.   

3 /6

సీఎం కేసీఆర్ పాటుగా ఆయన సతీమణి శోభ కూడా ఉన్నారు. నిన్నటి నుంచి ఎడమ చేతు కాస్త లాగడంతోనే ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం తెలుస్తోంది.   

4 /6

ప్రస్తుతం వైద్యులు సీఎం కేసీఆర్ కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు.   

5 /6

మధ్యాహ్నం వరకు సీఎం యశోద హాస్పిటల్‌లోనే ఉంటారని సమాచారం తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆ రిపోర్టులు రానున్నాయి.   

6 /6

ఇప్పటి వరకు అయితే బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని ఆయన వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.