Kia Syros Suv Price: Kia నుంచి గుడ్‌న్యూస్.. శక్తివంతమైన ఫీచర్స్‌తో Syros SUV వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు ఇవే!


Kia Syros Suv Price In India: మార్కెట్‌లోకి ప్రీమియం ఫీచర్స్‌తో Syros SUV కారు విడుదలైంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో త్వరలోనే కస్టమర్స్‌కి లభించబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

Kia Syros Suv Price In India: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ కియా గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన కార్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కియా కంపెనీ Syros SUV కారు మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ధరను మాత్రం ఇంకా అధకారికంగా వెళ్లడించలేదు. అయితే దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /6

కియా మోటార్స్ సిరోస్‌ను మొత్తం ఆరు వేరియంట్స్‌లో విడుదల చేసిన్నట్లు వెళ్లడించింది. ఇది HTK, HTX, HTX+లతో పాటు HTK (O), HTK+,  HTX+ (O) వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే..    

2 /6

కియా సిరోస్ కారుకు సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఈ కారులో ఎంతో శక్తివంతమైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో విడుదలైంది. ఈ ఇంజన్‌  172Nm గరిష్ట టార్క్‌తో పాటు 120hp శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.  

3 /6

అంతేకాకుండా  ఈ కారు  6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు హై ఎండ్‌ మోడల్స్‌లో  7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటో ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా ఈ కారులో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి.     

4 /6

అలాగే ఈ కారులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్‌ కారు ప్లే వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన సి-టైప్ USB ఛార్జర్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది టిల్ట్ అడ్జస్ట్ స్టీరింగ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.    

5 /6

అలాగే ఈ కారులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో పాటు యాపిల్‌ కారు ప్లే వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన సి-టైప్ USB ఛార్జర్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది టిల్ట్ అడ్జస్ట్ స్టీరింగ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.    

6 /6

ఇందులోనే కియా స్కిరోస్ HTK (O) కారు వేరియంట్‌ వివరాల్లోకి వెళితే.. ఇది  15-అంగుళాల స్టీల్ వీల్‌తో రాబోతోంది. అంతేకాకుండా ఇది కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే విడుదలైనట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన సన్‌రూఫ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంద.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x