Who Is Meesala Gurappa Here His Lifestory: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పాట కోయ్ కోయ్. ఆ పాట పాడిన మీసాల గుర్రప్ప ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లో ఆ పాట వినిపిస్తోంది. విశేష గుర్తింపు పొందిన గుర్రప్ప గురించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
మీసాల గురప్ప అలియాస్ బ్రదర్ క్రీస్తు దాసు అని పేరుపొందిన గురువప్ప జీవితం చాలా ప్రత్యేకమైనది.
తెలంగాణలోని భద్రాచలం సమీపంలో ఓ తండాకు చెందిన గురప్ప ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
మీసాల గురప్ప తండ్రి ఆంబోతు వెంకన్న ఓ మంత్రగాడు. దారి దోపిడీలు కూడా చేసేవాడు.
తన దోపిడీ దొంగల ముఠాకు కాపాలా ఉంచేందుకు గుర్రప్పకు చిన్నప్పటి నుంచి సొంత తండ్రి వెంకన్న విషం ఎక్కించాడు. దీంతో విషపు మనిషిగా మారాడు.
విషం ఎక్కించడంతో గుర్రప్ప ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. కొడుకును కాపాడుకునేందుకు గుర్రప్ప శరీరం నుంచి విషాన్ని తీసేయాలని తండ్రి వెంకన్న ప్రయత్నించాడు.
అన్ని ప్రయత్నాలు చేసినా విషం తగ్గపోవడంతో తండ్రి వెంకన్న తన కుమారుడు గురప్పను అడవిలోకి తీసుకెళ్లి వెళ్లాడు.
అటవీ ప్రాంతంలో ఉన్న గుర్రప్పకు ఒకరోజు దైవదూత వచ్చి సందేశం ఇచ్చాడని.. అప్పటి నుంచి తనలోని విషం తగ్గిపోయి సాధారణ మనిషిలాగా మారినట్లు గుర్రప్ప చెబుతుంటాడు. విషం తగ్గిన తర్వాత నుంచి ఓ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గురప్ప బిజీ అయ్యారు.