Kottimira Podi: కొత్తిమీర పొడి.. ఇక కూరల్లోకి ఏ ఇబ్బంది లేకుండా ఏడాదిపాటు నిల్వ చేసుకోవచ్చు..

Kottimira Podi Recipe: ఏ వంటి చేసినా కచ్చితంగా అందులో కరివేపాకు, కొత్తిమీరా ఉండాల్సిందే. వీటితో రుచి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిని కచ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేస్తేనే బాగుంటాయి. లేదంటే త్వరగా పాడవుతాయి. కానీ, కొంతమందికి ఈ కొత్తిమీరను నిల్వ చేయడం మాత్రం కాస్త కష్టం. అలాంటి వారి కోసం 'కొత్తిమీర పొడి' రిసిపీ.
 

1 /5

ఈ రిసిపీ తయారు చేసుకోవడం చాలా సులభం. కొత్తిమీరను దాదాపు ఏడాదిపాటు నిల్వ చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు కూడా మీరు కోల్పోకుండా ఉంటారు. ఎందుకంటే ఈ రిసిపీలో మనం కొత్తిమీరాను ఉడికించం.  

2 /5

కొత్తిమీర వేయనిదే ఏ సాంబార్‌, రసం రుచి పూర్తి కాదు. ఇది ఉండాల్సిందే. కానీ, ఒక్కోసారి సమయానికి అందుబాటులో ఉండక ఇబ్బంది పడుతుంటారు. మార్కెట్‌ నుంచి తీసుకువచ్చినా అది ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండదు.  

3 /5

ఈ కొత్తిమీర పొడి రిసిపీ తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిన కొత్తిమీర కట్టలను మార్కెట్‌ నుంచి తాజావి తీసుకురండి. వీటిలో నుంచి పొడి పచ్చని ఆకులు, గడ్డి వంటివి తీసి బాగా శుభ్రం చేయండి. చివర్లు కట్‌ చేయండి.  

4 /5

ఆ తర్వాత ఈ కొత్తిమీరను బాగా కడగాలి. కాటన్‌ గుడ్డను పరిచి నీరు లేకుండా తుడవాలి. సిల్క్‌ క్లాత్‌పై దీన్ని ఆరబెట్టాలి. ఓ రెండు రోజులు గడిస్తే కేవలం ఫ్యాన్‌ గాలికే ఇవి ఎండుతాయి.  

5 /5

ఇప్పుడు ఈ ఎండిన కొత్తిమీరను మిక్సీ చిన్న జార్‌ తీసుకుని పొడి కొట్టుకోవాలి. అంతే వీటిని గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఇది ఏడాదిపాటు నిల్వ ఉంటుంది. దీంతో మీరు నేరుగా కొత్తిమీర పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు.