Samantha: న్యూయార్క్‌ సిటీలో సమంత సందడి.. 14 ఏళ్ల తరువాత అంటూ ఎమోషనల్

Samantha Latest Pics: విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు సమంత. సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాంగ్స్, ట్రైలర్ అభిమానులను అలరించడంతో మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.
 

1 /5

సమంత ప్రస్తుతం న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నారు. అక్కడ రాయల్‌ లుక్‌లో బ్యూటీఫుల్ పిక్స్‌ను షేర్ చేశారు.   

2 /5

"న్యూయార్క్ నగరం కలలు కనేదని అంటారు.. నేను ఇక్కడ నా మొదటి సినిమా షూటింగ్‌తో నా కెరీర్‌ని ప్రారంభించాను. అప్పుడు భయపడిన చిన్న అమ్మాయి.. కానీ పెద్ద కలని కనేంత ధైర్యం ఉండేది. నేడు  14 సంవత్సరాల తరువాత అదే ప్రదేశానికి వచ్చాను.." సామ్ రాసుకొచ్చారు.  

3 /5

న్యూయార్క్ నగరంలో సందడి చేస్తూ.. స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.    

4 /5

ఈ ఏడాది శాకుంతలం మూవీతో బాక్సాఫీసు ముందుకు రాగా.. ఆ సినిమా దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖుషి మూవీపై భారీ ఎక్స్‌పెటేషన్స్ ఏర్పడ్డాయి.  

5 /5

ఇటీవల ఖుషి మ్యూజిక్ ఈవెంట్‌లో సామ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్‌పై అభిమానులను అలరించారు.