Income Tax Deadline: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు లాస్ట్ డేట్ పొడిగింపు..కొత్త తేదీ ఇదే

Income Tax Deadline: 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మరో 15రోజుల సమయం మాత్రమే ఉంది. సంవత్సరం ముగింపుతో, పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ చెల్లింపు సంబంధించిన పన్నులన్నీంటిని పూర్తి చేసుకోవాలి.  పన్ను మినహాయింపు, ముందస్తు పన్ను చెల్లింపు, రిటర్న్ దాఖలుకు  మరో 15రోజులు మాత్రమే గడువు ఉంది.  పెనాల్టీ పడకుండా ట్యాక్స్ చెల్లించాలంటే గడువులోపు పనిని పూర్తి చేయాలి. 
 

1 /6

Income Tax Deadline: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిర్ణయించింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ ను సమర్పించేందుకు మరింత సమయం దొరికింది.   

2 /6

అయితే ఒక చిన్న మెలిక ఉంది. ఈ పొడిగింపు గ్లోబల్ లావాదేవీలు చేసిన పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 92ఈ కింద రిపోర్టు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ లేదా నిర్దిష్ట దేశీయ లావాదేవీల్లో పాల్గొన్ సంస్థలకు కూడా ఈ గడువు పొడిగింపు అనేది వర్తిస్తుంది.   

3 /6

వాస్తవానికి 2024-24 ఆర్థిక సంవత్సరం లేదంటే 2025-25 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు కొత్త పన్ను చెల్లింపుదారులకు గతంలో విధించిన గడువు నవంబర్ 30, 2024.

4 /6

తాజాగా ఈ చివరి తేదీని డిసెంబర్ 15,2024 వకు సీబీడీటీ పొడిగించింది. అంటే పన్ను చెల్లింపుదారులకు మరో 15రోజుల సమయం మాత్రమే దొరికింది.   

5 /6

సమస్యల్లో ఉన్న లేదా కంటికి  కనిపించని ఆస్తులను సంపాదించడం, విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం, ఆదాయం, రాబడి, నష్టాలు, లాభాలు, రుణం ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం మొదలైన వ్యాపార లావాదేవీలకు సెక్షన్ 92ఈ వర్తిస్తుంది.

6 /6

2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట దేశీయ లేదా అంతర్జాతీయ లావాదేవీల్లో పాల్గొన్న సంస్థలు అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి రిపోర్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ 3సిఈబి ద్వారా ఆ రిపోర్ట్ ను ఆదాయ పన్ను అధికారులకు సమర్పించాలి.