Herbal Tea Stall Business Idea: నేటి యువత తమ సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ బిజినెస్ వల్ల కేవలం ఉద్యోగంపై ఆధారపడకుండా స్వంతంగా సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న వ్యాపారాలకు భారీ డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రభుత్వం లోన్‌లను కూడా అందిస్తుంది. అయితే మీరు కూడా ఏదైనా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే క్రేజీ బిజినెస్ ఐడియా మీకోసం.
బిజినెస్ ప్రారంభించాలనుకునే చాలామందికి రిస్క్ తక్కువగా ఉంటూనే తక్కువ పెట్టుబడితో ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయం.
బిజినెస్ అంటేనే కొంత రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ, రిస్క్‌ను తగ్గించుకుంటూనే తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి కొన్ని వ్యాపారాలు బోలెడు ఉన్నాయి. అందులో ఒకటి హెర్బల్ టీ స్టాల్ బిజినెస్ ఐడియా.
బండికి పెట్రోల్ లేకుండా పని చేయడం అసాధ్యం. అలాగే మనిషికి ఒక కప్పు టీ తాగకపోతే పని చేయడం చాలా కష్టం. టీ అనేది చాలా మందికి ఇష్టమైన, సులభంగా దొరికే. చవకైన పానీయం.
టీని తయారు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. దీని వల్ల చాలా మంది దీన్ని తాగుతారు. నేటి మారిన జీవనశైలి కారణంగా చాలా మంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు.
కాబట్టి మీరు ఒకవేళ టీ స్టాల్ బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటే సాధారణ టీ కాకుండా హెలబెల్ టీలను తయారు చేసి అమ్మడం ఒక గొప్ప, ఆరోగ్యకరమైన ఐడియా.
ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 50,000 వేలు ఉంటే సరిపోతుంది. మీ వద్ద అంత పెట్టుబడి లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్ తీసుకోవచ్చు.
ఈ బిజినెస్‌తో మీరు రోజుకు రూ. 5,000 సంపాదించవచ్చు. సంవత్సరానికి మీరు కాలు కదపకుండా రూ. 1,500,000 సంపాదించవచ్చు. మీ బిజినెస్ మరింత పెరగడం కోసం సోషల్ మీడియాను కూడా ఉపయోగించవచ్చు.
సాధారణ టీ, కాఫీ కంటే వివిధ రకాల మూలికలు, పువ్వులు, పండ్లు, వేర్లు వంటి వాటితో తయారు చేసే హెర్బల్ టీ ఆరోగ్యకరమైనది కాబట్టి ప్రతిఒక్కరు ఈ టీకి ఆకర్షితులవుతారు.
బిజినెస్ ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో హెర్బల్ టీలకు ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ఆఫీస్‌లు, జిమ్‌లు, హాస్టళ్లు ఉన్న ప్రాంతాలలో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్నందున FSSAI లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. మునిసిపాలిటీ, హెల్త్ డిపార్ట్‌మెంట్ వంటి వాటి నుంచి అనుమతులు తీసుకోవాలి.