Lowest Interest Car Loans: మీకు నచ్చిన కారు కొనుక్కొండి.. అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే

Car Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. మరి ఆ బ్యాంకుల వివరాలు తెలుసుకుందామా? 

1 /7

Car Loan Rates: మీరు  కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే..ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది బ్యాంకు లోన్ ద్వారా కారు కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారు ఏయో బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారో సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని పరిగణలోనికి తీసుకుని..  నేడు, దేశంలోని అనేక ప్రభుత్వ,  ప్రైవేట్ బ్యాంకులు కారు రుణాలను అందిస్తున్నాయి. ఇతర రుణాల మాదిరిగానే, కార్ లోన్ వడ్డీ కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ లేదా CIBIL స్కోర్ బాగుంటే, బ్యాంక్ మీకు సాపేక్షంగా తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇస్తుంది. ఇది కాకుండా, చాలా బ్యాంకులు ఎప్పటికప్పుడు కారు లోన్ కోసం వివిధ రకాల ఆఫర్‌లతో ముందుకు వస్తున్నాయి.

2 /7

5 సంవత్సరాల కాలవ్యవధి కోసం అతి తక్కువ వడ్డీ రేట్లకు రూ. 5 లక్షల కార్ లోన్‌ను అందిస్తున్న 6 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  దీనితో పాటు, మీరు ఈ బ్యాంకుల నుండి కారు లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి. ఈ బ్యాంకులు కారు లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజుగా ఎంత డబ్బు వసూలు చేస్తున్నాయో  కూడా తెలుసుకుందాం.   

3 /7

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.75 నుండి 10.60 శాతం వడ్డీతో లోన్ ఇస్తుంది. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1000 నుండి రూ.15,000 వసూలు చేస్తోంది. ప్రతి నెలా రూ. 10,319 నుండి రూ. 10,772 వరకు EMI చెల్లించాలి.  

4 /7

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8.70 నుండి 13.00 శాతం  వడ్డీతో లోన్ ఇస్తుంది. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1000 నుండి రూ.15,000 వరకు వసూలు చేస్తోంది. ప్రతి నెలా రూ. 10,307 నుండి రూ. 11,377 వరకు EMI చెల్లించాలి.  

5 /7

కెనరా బ్యాంక్ 8.70 నుండి 12.70శాతం వడ్డీతో లోన్ ఇస్తుంది . ప్రాసెసింగ్ ఫీజుగా గరిష్టంగా రూ. 2500 వసూలు చేస్తోంది.  ప్రతి నెలా రూ. 10,307 నుండి రూ. 11,300 వరకు EMI చెల్లించాలి.

6 /7

ఈ బ్యాంకు  8.70 నుండి 10.45 శాతం వడ్డీతో రుణం అందిస్తోంది.  ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 1000 మాత్రమే వసూలు చేస్తోంది. ప్రతి నెలా రూ. 10,307 నుండి రూ. 10,735 వరకు EMI చెల్లించాలి.  

7 /7

ఈ బ్యాంకు 8.45 నుండి 10.55 శాతం వడ్డీతో లోన్ అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజుగా ఎలాంటి డబ్బును వసూలు చేయడం లేదు. ప్రతి నెలా రూ. 10,246 నుండి రూ. 10,759 వరకు EMI చెల్లించాలి.