Lucky Zodiac Sign: 12 ఏళ్ల తర్వాత మిథునరాశిలోకి గురుగ్రహం.. 3 రాశులవారికి ధనయోగం.. డబ్బే, డబ్బు!

Lucky Zodiac Sign In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గురు గ్రహాన్ని సంపద, ఆనందం, విద్య, పిల్లలకు సూచికగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహం శుభస్తానంలో ఉంటే డబ్బు, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఈ గురు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి దాదాపుయ 13 నెలల పాటు సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభ రాశిలో సంచార దశలో ఉన్నాడు. వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో ఉంటాడు. 2025 సంవత్సరం మే తర్వత ఈ గ్రహం మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 
 

1 /6

2025 సంవత్సరం మే నెలలో ఈ గురు గ్రహం మిథున రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహ సంచారంతో ఏయే రాశులవారి జీవితాల్లో విపరీతమైన మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.   

2 /6

మిథున రాశివారికి ఈ గురు గ్రహం సంచార ప్రభావం ఏంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ గ్రహ సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.  

3 /6

మిథున రాశివారికి ఈ సంచార ప్రభావం కెరీర్‌ జీవితంపై కూడా పడుతుంది. దీంతో వీరికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే మానసిక ఆనందం కూడా పెరుగుతుంది, వివాహితులకు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.   

4 /6

సింహ రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారు గురు గ్రహం సంచారం చేసే క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు.   

5 /6

గురుగ్రహం మిథున రాశివారిలోకి సంచారం చేయడం వల్ల వృషభ రాశివారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి మానసిక ఆనందం పెరుగుతుంది.

6 /6

ఈ సంచార ప్రభావం కారణంగా వృషభ రాశివారికి కూడా బంధాలు కూడా బలపడుతాయి. దీంతో పాటు వృత్తి జీవితంలో సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి.