Mahalaya Pitru Paksham: మహాలయ పక్షాల్లో ఎలా శ్రాద్దం పెట్టాలి.. ? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Mahalaya Pitru Paksham: భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను పితృ పక్షాలుగా పిలుస్తారు. ఈ పక్షం రోజుల్లో పెద్దలను తలచుకొని తమ శక్తి కొలది శ్రాద్ధం పెట్టడం అనాదిగా వస్తుంది. ఈ పక్షం రోజుల్లో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు.. మన మాతృ, పితృ వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించవచ్చు.

1 /6

ముఖ్యంగా కన్నుమూసిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము లేదా అపర పక్షములనీ కూడా పిలుస్తుంటారు.

2 /6

మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్య ఉద్దేశ్యము. 18-09-2024 నుండి 02.10.2024 వరకు మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న  పదిహేను రోజులు మహాలయ పక్షములుగా వ్యవహరిస్తారు.

3 /6

పితృదేవతలకు.... ఆకలా...? అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

4 /6

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది ఇది భగద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన మాట. 

5 /6

అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

6 /6

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుషప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా మారుతుంది. ఆ తర్వాత స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.