Devi Sri Prasad vs Mahesh Babu: సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పై మండిపడుతున్నారు. అసలు తమ హీరోకి.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ విలువ ఇవ్వలేదు అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తాజాగా హైదరాబాదులో అక్టోబర్ 19వ తేదీన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అటు శ్రోతలను అలరించడానికి సీనియర్ సింగర్స్ కూడా వేదికను అలంకరించారు. ముఖ్యంగా గాన కోకిల సుశీల తర్వాత అంత పేరు సొంతం చేసుకున్న చిత్ర కూడా మెలోడీ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించబోతోంది.
ఇకపోతే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 19వ తేదీ నుంచి గచ్చిబౌలి స్టేడియంలో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మహేష్ బాబు పాటలను పాడకపోవడంతో మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీప్రసాద్ మెగా కుటుంబ హీరోలకు మాత్రమే తన మ్యూజిక్ అందిస్తూ తెలుగు ఇండస్ట్రీలో పేరు సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించడం లేదు.
దీనికి తోడు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గ్రాండ్ గా అంత పెద్ద లైవ్ షో నిర్వహిస్తున్నప్పటికీ మహేష్ బాబు సినిమాలలోని ఒక పాట కూడా పాడకపోవడంతో ఇక మహేష్ బాబు, దేవిశ్రీప్రసాద్ మధ్య గొడవ ఉన్నది నిజమే అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ బాబు అభిమానులు పూర్తిస్థాయిలో మండిపడుతూ రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై దేవిశ్రీప్రసాద్ స్పందన ఇచ్చేవరకు ఈ ట్రోల్స్ ఆగవు అని సమాచారం.