Melasma: కొబ్బరినూనె, పసుపుతో మ్యాజికల్ క్రీమ్‌.. ముఖంపై మంగు మచ్చలు వారంలో మాయం..!

Melasma Remedy with coconut oil and turmeric: ముఖంపై మంగు మచ్చలు అందవహీనంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ముఖంపై మంగు మచ్చలను సులభంగా తగ్గించుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే పసుపు, కొబ్బరి నూనెతో మంగు మచ్చలకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.
 

1 /5

కొబ్బరి నూనె పసుపు రెండిటితో కలిపి మంగు మచ్చలకు చెక్ పెట్టే రెమెడీ తయారు చేసుకుందాం. ఈ రెండిటిలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఈ రెండు నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి.  

2 /5

ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. ఈ రెండిటినీ కలిపి బాగా స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి.  

3 /5

ఈ పేస్టును మీ చేతి వేళ్లతో సాయంతో మంగు మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయాలి. ఈ ఫేస్ కి మాస్క్ ను వారానికి మూడుసార్లు అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.  

4 /5

అయితే కొంతమందికి పసుపు పడకపోవచ్చు. అందుకే ముందుగానే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీ ముఖానికి ఉపయోగించండి. కొన్ని నివేదికల ప్రకారం ముఖ్యంగా NIH నివేదిక ప్రకారం పసుపులో కర్కూమిన్ ఉంటుంది ఇది పిగ్మెంటేషన్ సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది.  

5 /5

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మంగు మచ్చలను తొందరగా తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్ పూర్తిగా నివారిస్తాయి. అంతే కాదు కొబ్బరి నూనె వల్ల మీ ముఖం హైడ్రేటెడ్ గా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)