Malavya Raja Yogam: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. 2025 జనవరిలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి దశ, దిశ మారబోతుంది.
Malavya Raja Yogam: 2025లో గ్రహ మండలంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని అరుదైన యోగాలు కలగబోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాలవ్య రాజయోగం ఒకటి. ఈ యోగం వలన కొన్ని రాశుల వారికీ కొన్ని అరుదైన ఫలితాలు అందుకోబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
కర్కాటకం: మాలవ్య రాజయోగం వల్ల ఈ రాశుల వారికీ అదృష్టం బంక పట్టినట్టు పట్టబోతుంది. ఆదాయంలో భారీ పెరుగుదల ఉండబోతుంది. విదేశాలకు వెళ్లే వాళ్లకు ఇదే శుభ తరుణం. ఆర్ధిక సమస్యలు అనేకం దూరమవుతాయి.
మకర రాశి: రాబోయే 2025లో మకర రాశి వారికీ అన్నింటా శుభ ప్రదంగా ఉండబోతుంది. అంతే కాకుండా రాజకీయాల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంటారు. చేయాల్సిన పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి.
ధనుస్సు రాశి: మీ పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. అంతే కాకుండా వ్యాపార పరంగా తలెత్తే ఆర్థికపరమైన ఇష్యూస్ సాల్వ అవుతాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కలిసొస్తాయి. ఆర్ధికంగా మీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి.
కుంభ రాశి : చేసే ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.సమాజంలో గౌరవ, ప్రతిష్ఠతలు పెరుగుతాయి. మీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. వ్యాపారంలో ఎక్కువ లాభం గడించే అవకాశాలున్నాయి.
గమనిక: ఈ ఆర్టికల్ లో మీకు అందించబడిన సమాచారం సాధారణ పరిజ్ఞానం, మత విశ్వాసాలతో పాటు జ్యోతిష్యులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇచ్చిందే. జీ మీడియా న్యూస్ ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.