Maruti Ciaz Sales Record: సెడాన్ కార్ల అమ్మకాల్లో మారుతి సియాజ్‌దే అగ్రస్థానం, ప్రత్యేకతలివీ

ఇండియన్ కార్ మార్కెట్‌లో ఇప్పటికీ తిరుగులేదని నిరూపించుకుంది మారుతి కంపెనీ. మార్కెట్‌లో ఇతర కంపెనీల్నించి ఎంత పోటీ ఉన్నా సరే..అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా సెడాన్ సెగ్నెంట్ కార్ల అమ్మకాల్లో మారుతి పైచేయి సాధించింది. ఎస్‌యూవీ వెహికల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నా..మారుతి మాత్రం సెడాన్ అమ్మకాల్లో వృద్ధి సాధించింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం..

Maruti Ciaz Sales Record: ఇండియన్ కార్ మార్కెట్‌లో ఇప్పటికీ తిరుగులేదని నిరూపించుకుంది మారుతి కంపెనీ. మార్కెట్‌లో ఇతర కంపెనీల్నించి ఎంత పోటీ ఉన్నా సరే..అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా సెడాన్ సెగ్నెంట్ కార్ల అమ్మకాల్లో మారుతి పైచేయి సాధించింది. ఎస్‌యూవీ వెహికల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నా..మారుతి మాత్రం సెడాన్ అమ్మకాల్లో వృద్ధి సాధించింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం..
 

1 /4

మారుతి సియాజ్ కారు ప్రస్తుతం 1.5 పెట్రోల్ వెర్షన్‌లో లభిస్తోంది. 103 బ్రేక్ హార్స్ పవర్‌తో గరిష్టంగా 138 ఎన్ఎం టార్క్ అందిస్తోంది. స్టాండర్డ్ ఆటోమేటిక్ గేర్ వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇంకా ఇతర ప్రత్యేకతలు సియాజ్‌లో చాలానే ఉన్నాయి.

2 /4

మారుతి సంస్థ 2014లో డీజిల్‌ వెర్షన్‌లో సియాజ్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పుడు భారీగానే అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత డీజిల్‌ వెర్షన్‌ ఆపేసి ఇప్పుడు పెట్రోల్‌ వెర్షన్‌లోనే సియాజ్‌ను అమ్ముతోంది. అయినా అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. సియాజ్‌ మార్కెట్‌కి వచ్చినప్పటి నుంచి డిజైన్‌, స్టైల్‌, కంఫర్ట్‌ ఇలా అన్ని విభాగాల్లో కస్టమర్లను ఆకర్షించగలిగిందని మారుతి సంస్థ వెల్లడించింది.

3 /4

మారుతి సంస్థ 2014లో మిడ్‌‌రేంజ్‌ సెడాన్‌గా సియాజ్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా సియాజ్‌ కార్ల అమ్మకాలు జరిగాయి. స్కోడా ర్యాపిడ్‌, హ్యుందాయ్‌ వెర్నా, వోక్స్‌వాగన్, వెంటోల నుంచి పోటీ ఉన్నా మారుతి సియాజ్ మాత్రం తన అధిపత్యాన్ని కొనసాగించింది.

4 /4

ఇండియన్ మార్కెట్‌లో గత పదేళ్లుగా ఎస్‌యూవీ వెహికల్స్‌కు అత్యధిక డిమాండ్ నెలకొంది. ఎంట్రీ లెవెల్ కార్లు కాకుండా ఎస్‌యూవీ సెగ్నెంట్ అమ్మకాలే ఎక్కువగా ఉంటున్నాయి. సెడాన్ సెగ్మెంట్లో ఎలాంటి వృద్ధి లేకపోయినా..మారుతి మిడ్‌రేంజ్ సెడాన్ కార్‌గా ఉన్న సియాజ్ మాత్రం అమ్మకాల్లో వృద్ధి సాధించింది.