Hill Stations: ప్రపంచంలో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. కొన్ని భారీ బడ్జెట్‌తో కూడి ఉంటాయి. అందరికీ సాధ్యం కాని పరిస్థితి. అయితే తక్కువ బడ్దెట్తో విహరించగలిగే అత్యంత సుందరమైన హిల్ స్టేషన్ల్ ఇండియాలో ఉన్నాయి. ఇక్కడున్న అందమైన లోయలు, పచ్చదనం కచ్చితంగా మిమ్మల్ని కట్టి పడేస్తుంది. తిరిగి వెళ్లడానికి మనస్సు ఒప్పదు కూడా. అంత అందంగా, మనోహరంగా ఉండే ఈ హిల్ స్టేషన్స్ పర్యటనకు ఖర్చు కూడా చాలా తక్కువే అవుతుంది.
మాండ్ వగడ్ పట్టణం సౌందర్యానికి మారుపేరుగా ఉంది. ఈ పట్టణం మాండ్రవిద్య పర్వత శ్రేణిపై ఉంది. చారిత్రాత్మకమైన ఈ పట్టణంలో రాజసాన్ని ఒలికించే కట్టడాల్ని చూడవచ్చు.
అత్యంత అందమైన, ప్రశాంత వాతావరణం కావాలనుకుంటే తోరమల్కు వెళ్లాల్సిందే. ఇక్కడ తిరిగేందుకు ఆలయాలున్నాయి. ఇవి కాకుండా ఇక్కడ మీరు సన్‌సెట్ పాయింట్, గోరక్షనాథ్ ఆలయం, లోటస్ లేక్, ఆవాశ్ బాడీ పాయింట్, చెక్ డ్యామ్‌లను సందర్శించుకోవచ్చు.
ఈ ప్రాంతం పేరు చిలక్ధారా. ఇది మహారాష్ట్రలోని అత్యంత అందమైన హిల్‌స్టేషన్. ఇక్కడ కూడా భీముడు దుష్డుడైన కీచకుడిని యుద్ధంలో చంపి..ఈ లోయలోనే విసిరేశాడని పురాణాలు చెబుతాయి. ఈ ప్రాంతంలో దేవీ పాయింట్, హరికేన్ పాయింట్, మోజారీ పాయింట్, ప్రాస్పెక్ట్ పాయింట్ వంటి ప్రాంతాలు ప్రాచుర్యం పొందాయి.
సత్పడ్ శ్రేణి పర్వతాల్లో ఉన్న అందమైన హిల్ స్టేషన్ పంచ్మడీ. దీనికి సత్పడ్కు రాణిగా కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని అతి ఎత్తైన హిల్‌స్టేషన్ పంచ్మడి. మహాభారత సమయంలో అజ్ఞాతవాసం సందర్భంగా పాండవులు ఇక్కడ చాలాకాలం గడిపినట్టు పురాణాలు చెబుతాయి. పంచ్మడీలో ప్రతియేటా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ అందమైన జలపాతాలు, నదులు, లోయలతో ప్రకృతి సహజసిద్ధమైన అందంతో ఉంటుంది.