Chiranjeevi About Allu Family : గత కొద్ది రోజులగా చిరంజీవి.. పెద్దగా మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమీ లేవు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక ప్రముఖ వెబ్సైట్ కి చిరంజీవి.. ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారట. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉన్న గొడవ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది..
కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. అనేక అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు అని ఒక వార్త సినీవర్గాల్లో తెగ వినిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత..ఆయన ఏమీ మాట్లాడకపోవడంతో.. అభిమానులు చిరంజీవి ఏమి మాట్లాడుతారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో కూడా చిరంజీవికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు జరిగాయి. ఆయనకి అవార్డులు వచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. ఈ క్రమంలో జనసేనా నాయకుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తరువాత కూడా.. చిరంజీవి కుటుంబం పైన వస్తున్న వార్తలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, చిరంజీవి వ్యక్తిగత జీవితంలో జరిగిన అనేక విషయాలు, గతం, వర్తమానం, భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకున్నారట. ఇంటర్వ్యూలో చిరంజీవి కొన్ని అసలు చెప్పని విషయాలను కూడా పేర్కొన్నారని సమాచారం. ఈ ఇంటర్వ్యూ మూడు భాగాలుగా విడుదల కానుందట.
గత కొన్నిమాసాలుగా మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో పుకార్లు వినిపించాయి. చిరంజీవి, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ఆయన ఇప్పటి వరకు ఖండించలేదు. అయితే, రాబోయే ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి పలు క్లారిటీలు ఇవ్వనున్నారు, దీని వల్ల అభిమానులు.. ఎదురుచూస్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి గతంలో ఎప్పుడూ పంచుకోని విషయాలను తొలిసారిగా వెల్లడించనున్నారట. కుటుంబం, వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా, తన కెరీర్ పై కూడా ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నారు అని సమాచారం. చిరంజీవి అభిమానులకు ఈ ఇంటర్వ్యూ తప్పక చూడాల్సినదిగా మారనుందట.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా అనే సామాజిక ఫాంటసీ సినిమాతో బిజీగా ఉన్నారు, ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో మరో కొత్త ప్రాజెక్ట్ కోసం కూడా సిద్ధమవుతున్నారు. చిరంజీవి అభిమానులు విశ్వంభరా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.