Meera Chopra Marriage: కేజ్రీవాల్‌ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్‌ హీరోయిన్.. పిక్స్ వైరల్..

Meera Chopra Marriage: పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'బంగారం' సినిమాలో కథానాయికగా నటించిన మీరా చోప్రా గుర్తుందా.  ఈ సినిమా తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రక్షిత్ కేజ్రీవాల్‌ను రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. 

1 /5

పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'బంగారం' మూవీలో నటించిన మీరా చోప్రా గుర్తుంది కదా. ఈ సినిమా తర్వాత తెలుగులో 'వాన', నితిన్‌తో 'మారో' సినిమాల్లో కలిసి నటించింది. తెలుగులో పెద్దగా గుర్తింపు దక్కకపోవడంపై హిందీ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. తాజాగా పెళ్లి చేసుకొని వివాహా బంధంలో అడుగుపెట్టింది. 

2 /5

మీరా చోప్రా వివాహాం ఈ మంగళవారం రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ రిసార్టులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన రక్షిత్ కేజ్రీవాల్‌తో జరిగింది. అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధంతో హిందూ సంప్రదాయ పద్దతిలో వీళ్లిద్దరు ఒకటయ్యారు. 

3 /5

తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సన్నిహితులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

4 /5

గత కొన్నేళ్లుగా మీరా చోప్రా, రక్షిత్ కేజ్రీవాల్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే మీరా చోప్రా పలు ఇంటర్వ్యల్లో ప్రస్తావించడం గమనార్హం. 

5 /5

మీరా చోప్రాకు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలు కజిన్స్ అవుతారు. మీరా చోప్రా తండ్రి సురేష్ చోప్రా, ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతాడు.