Siraj, Zanai Love: ఆమె నా లవర్ కాదు.. చెల్లెలు లాంటిది: రూమర్లపై బాంబ్‌ పేల్చిన సిరాజ్

Mohammed Siraj Reveals Relation With Zanai Bhosle: క్రికెట్‌ ప్రపంచంలో మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని పుకార్లు షికార్లు చేయడంతో ఆ వార్తలపై సిరాజ్‌ స్పందించాడు. అలాంటిదేమీ లేదని.. అసలు ఆ అమ్మాయి తనకు ఏమవుతుందో చెప్పి షాకింగ్‌ ఇచ్చాడు.

1 /6

భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ క్రికెట్‌లో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో సిరాజ్‌ కొంత తడబడుతున్నాడు. ప్రదర్శన చేయలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోతున్నాడు. 

2 /6

తెలంగాణకు చెందిన మహ్మద్‌ సిరాజ్‌ తాజాగా ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒక ఫొటో ఒక్కసారిగా నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని చర్చ జరిగింది.

3 /6

ప్రముఖ గాయని ఆశా బోస్లే మనవరాలు జనై భోస్లేతో మహ్మద్‌ సిరాజ్‌ దిగిన ఫొటో ఈ ప్రచారానికి ఊపిరి పోసింది. వీరిద్దరూ కొంత క్లోజ్‌గా ఉండడంతో జనైతో ఆమె ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది.

4 /6

ఈ వార్తల నేపథ్యంలో సిరాజ్‌ వెంటనే స్పందించాడు. 'జనై నాకు ప్రేయసి కాదు. ఆమె నాకు చెల్లెలు వరుసలాంటిది' అని చెప్పి సిరాజ్‌ కుండబద్దలు కొట్టాడు. 

5 /6

'ఆమెలాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు' అనే కవితను మహ్మద్‌ సిరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టుకున్నాడు.

6 /6

ఈ పుకార్లపై జనై భోస్లే కూడా స్పందిస్తూ.. 'సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడు' అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేసింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x