Mukesh Ambani: ముకేశ్‌ అంబానీ కారు డ్రైవర్‌ అవుతారా? జీతం, ఇతర సౌకర్యాల వివరాలు ఇవే!

Mukesh Ambanis Car Driver Salary And Allowances Here: లక్షల కోట్లకు అధిపతి అయిన పారాశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీకి సంబంధించిన విషయాలు అందరికీ ఆసక్తికరం. అతడి వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అంబానీ ఇంటి డ్రైవర్‌, వ్యక్తిగత సిబ్బంది జీతం ఎలా ఎంత, డ్రైవర్‌గా ఎలా కావాలో తెలుసుకుందాం.

1 /8

లక్షల కోట్లకు అధిపతి: ప్రపంచంలోనే అపర కుబేరుడు, భారతదేశంలో అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తి ముకేశ్‌ అంబానీ. అతడి ఆస్తులు 103 బిలియన్‌ డాలర్లు ఉండగా.. దేశంలో అత్యధిక సంపాదన కలిగిన అతడి

2 /8

భారీ జీతం: ముఖేష్ అంబానీ తన వ్యక్తిగత డ్రైవర్, వ్యక్తిగత సిబ్బందికి భారీగా జీతాలు ఇస్తున్నట్లు కొన్నేళ్ల కిందట ఓ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఒక్క జీతమే కాకుండా ఇతర అనేక భత్యాలు కూడా ఇస్తారని ఆ సంస్థ నివేదికలో పేర్కొంది.

3 /8

ఇతర సదుపాయాలు: పదేళ్ల కిందటి నివేదిక ప్రకారం ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత డ్రైవర్‌కు నెల జీతం రూ.2 లక్షలు అందిస్తున్నట్లు తెలిసింది. సంవత్సరానికి రూ.24 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఈ జీతం ప్రఖ్యాత సంస్థల్లో పని చేసే ఉద్యోగుల కన్నా అధికం కావడం విశేషం.

4 /8

రెట్టింపు జీతం: ఆ లెక్కలు పదేళ్ల కిందటిది కాగా ఇప్పుడు ముకేశ్‌ అంబానీ డ్రైవర్ భారీగా పెరిగి ఉంటుందని భావించవచ్చు. గతంలో ఇచ్చిన దానికన్నా రెట్టింపు మొత్తం పొందుతుండవచ్చు. ఇప్పుడు లెక్కలు వేస్తే దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా బీమా, వసతితోపాటు వీరికి కూడా భద్రత ఉంటుందని తెలుస్తోంది.

5 /8

ఎందుకు అధిక జీతం: ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడు.. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో ముకేశ్‌ అంబానీని అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉండాలి. కారు నడపడంలో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే ఏ ప్రమాదం వచ్చినా.. ఏం జరిగినా వెంటనే అప్రమత్తమై కారు నడపాల్సి ఉంది. అలాంటి నిష్ణాతుడైన డ్రైవర్‌ను మాత్రమే ఎంపిక చేస్తారు. అందుకే ఆ డ్రైవర్‌కు భారీగా జీతాలు ఉంటాయి.

6 /8

పటిష్ట శిక్షణ: అంబానీ డ్రైవర్లకు డ్రైవింగ్‌లో పటిష్ట శిక్షణ అందిస్తారు. అంతేకాకుండా డ్రైవింగ్‌ నైపుణ్యాలు కూడా పెంచుతారు. విలాసవంతమైన.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడుపుతారు. కుటుంబానికి అత్యున్నత స్థాయి భద్రత, భద్రతను అందిస్తారు.

7 /8

ప్రత్యేకంగా నియామకం: ముకేశ్‌ అంబానీ డ్రైవర్లను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. ఈ డ్రైవర్లు హై-ఎండ్ వాహనాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు.

8 /8

వివరాలు గోప్యం: ముకేశ్‌ అంబానీ కుటుంబం ఏ ప్రైవేటు ఏజెన్సీని ఎంచుకుందో తెలియదు. కానీ ప్రపంచంలోనే టాప్‌ ఏజెన్సీని ఎంచుకుని ఉండవచ్చు. ఏజెన్సీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. భద్రతాపరమైన కారణాల రీత్యా డ్రైవర్లు, వ్యక్తిగత సిబ్బంది వివరాలు, ఏజెన్సీ వివరాలు బయటకు రావు.