Vastu Tips: తలుపు వెనుక ఈ వస్తువులను వేలాడదీస్తే సర్వనాశనం.. నెగిటివిటీకి ఆహ్వానం ..!

Vastu Tips for Doors: వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. దాని ప్రకారమే మనం మెయిన్‌ డోర్, ఇంటి నిర్మాణం చేసుకుంటారు. అయితే, ఇంటి ప్రధాన ద్వారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇంటి ఇతర డోర్లకు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంటి డోర్ల వేనుక కొన్ని వస్తువులను వేళాడదీయకూడదు. దీని వల్ల ఇంట్లో ఆర్థిక పురోగతి కుంటుపడుతుంది. 
 

1 /6

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాం. అయితే, వస్తువులను కూడా ఈ నియమాలను అనుసరించే అమర్చుకోవాలి. దీంతో అలాంటి ఇంట్లో సుకఃసంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యతిరేకంగా చేస్తే అలాంటి ఇంటిపై నెగిటివిటీ పెరిగిపోతుంది.  

2 /6

సాధారణంగా కొంతమంది కాదు, చాలామంది కూడా వారి బెడ్‌రూమ్‌ డోర్ల వెనుక భాగంలో బట్టలు, లేదా ఇతర వస్తువులను వేలాడతీస్తు ఉంటారు. అయితే అలా చేయకూడదు. ఇది ఇంటి పురోగతిని కుంటు పడేలా చేస్తుంది.  

3 /6

వాస్తుప్రకారం ఇంటి ద్వారం పైభాగం లక్ష్మీదేవికి స్థానంగా పరిగణిస్తారు. ఇలా డోర్‌కు వెనుక భాగంలో హ్యాంగర్‌లు ఏర్పాటు చేసి దుస్తులు, బ్యాగులు వేలాడదీస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి.  

4 /6

ఇంట్లో ఏ డోర్‌కు వెనుక భాగంలో ఇలా హుక్స్‌ ఏర్పాటు చేయకూడదు. దుస్తులు వేలాడదీయకూడదు. ఇంటికి రంగు, దిక్కు మాత్రమే కాదు. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు కూడా చేయకూడదు. మీరు ఈ విధానాన్ని అవలంభిస్తే వెంటనే మానుకోండి.  

5 /6

ఎందుకంటే కొంతమంది విడిచిన దుస్తులు కూడా డోర్‌ వెనుక భాగంలో అలాగే వేలాడదీస్తారు. లేదా చిరిగిన దుస్తులను అలాగే హుక్స్‌పై వదిలేస్తారు. మీరు వాడకపోతే వాటిని వెంటనే బయట పడేయండి.  

6 /6

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)