Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు. 80వేలకు చేరిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా కిందిదిగుతోంది. బంగారం ధరలు వరుసగా తగ్గడానికి అమెరికా మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ ఉన్న పరిణామాల కారణంగా పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నేడు బంగారం ధర రూ. 79వేలకు చేరుకుంది. ఒక్కరోజులోనే 1400 వరకు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం, వెండి ధరలు నేడు డిసెంబర్ 14వ తేదీ శుక్రవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1400 తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ. 79,500 పలుకుతోంది.
గురువారం రూ. 80,900 ఉంది. వెండి కిలో ధర రూ. 4,200తగ్గింది. రూ. 92,400కు పడిపోయింది. బంగారంలో 99.5 శాతం ప్యూరిటీ వేరియంట్ ధర 10 గ్రాములకు రూ. 1,400 తగ్గింది ప్రస్తుతం రూ. 79,100కు చేరుకుంది
హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ. 600 తగ్గింది. ప్రస్తుతం రూ. 78,870 పలుకుతోంది. వెండి ధర కిలోకు రూ. 3000 తగ్గింది. రూ. 1,01,000 వద్ద ఉంది.
ప్రాఫిట్ బుకింగ్ తో బంగారం ధరలు పడిపోతున్నాయి. దీనికి తోడు అమెరికా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గడం, వీక్లీ జాబ్ లెస్ క్లెయిమ్స్ పెరగడంతో బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 2670 డాలర్లకు దిగివచ్చిందని ఎల్ కేపీ ఎనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు.
డాలర్ బలపడుతుందటం, అమెరికా ఎకానమిక్ డేటా మిశ్రమంగా ఉండటంతోపాటు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధర శఉక్రవారం భారీగా పడిపోయిందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు.
ఈ సారి 17,18వ తేదీల్లో ఫెడ్ మీటింగ్ జరగనుంది. దీనికి ముందుగానే ఇన్వెస్టర్లు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ సమావేశంలో 25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తారనే అంచనాలు కూడా పెరిగాయి.