Naga Chaitanya - Sobhita Dhulipala: ఈ మధ్యనే ఆగస్టు 8వ తేదీన నాగ చైతన్య శోభిత దూళిపాల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో బోలెడు పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
2021 లో సమంతతో విడిపోయిన తరువాత నుంచి నాగచైతన్య నటి శోభిత గూడచారి ఫేమ్ హీరోయిన్ శోభిత దూళిపాలతో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. ఇద్దరు దీని గురించి క్లారిటీ ఇవ్వకుండా చాలాకాలం సస్పెన్స్ నడిచింది
పుకార్లు అన్నిటినీ నిజం చేస్తూ నాగచైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. చాలాకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఈ మధ్యనే ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. అదే రోజున నాగచైతన్య తండ్రి నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అప్పటినుంచి వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక వీళ్ళిద్దరి పెళ్లి గురించి వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ళ పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే విషయాలపై చాలా పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో కాకుండా ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అక్కినేని కుటుంబం వీళ్ళిద్దరి పెళ్లి సంబరాలు వారం పాటు పారిస్ లో జరపబోతోంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది.
అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అనడంతో ముహూర్తం కూడా బావుంది అంటూ ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిపించామని.. పెళ్లికి కంగారు లేకుండా కొంత సమయం తీసుకుంటామని నాగార్జున కూడా చెప్పిన సంగతి తెలిసిందే.