Modi Cabinet 2024: నరేంద్ర మోడీ క్యాబినెట్ లో ఎంత మంది మాజీ సీఎంలు ఉన్నారంటే..?

Narendra Modi Cabinet 2024: నరేంద్ర మోడీ ఈ ఆదివారం సాయంత్రం విదేశీ, స్వదేశీ అతిథుల మధ్య ఎంతో అట్టహాసంగా మూడోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా పనిచేసారు. ఈయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సారి మోడీ క్యాబినేట్ లో పలువురు మాజీ సీఎంలు కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అందులో నరేంద్ర మోడీతో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారంటే..

1 /7

నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. వరుసగా మూడు సార్లతో రికార్డు క్రియేట్ చేసారు. ఈయన ప్రధాని పదవి చేపట్టబోయే ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసారు.

2 /7

రాజ్ నాథ్ సింగ్ నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర మంత్రిగా నెంబర్ 2గా ప్రమాణ స్వీకారం చేసారు రాజ్ నాథ్ సింగ్. ఈయన గతంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. మోడీ గత హయాంలో హోం, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సారి రాజ్ నాథ్ ఏ పోర్ట్ పోలియో కేటాయిస్తారో చూడాలి.

3 /7

శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య ప్రదేశ్ కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తాజాగా మోడీ మూడో క్యాబినేట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

4 /7

మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలోని కర్నాల్ నుంచి లోక్ సభకు ఎన్నికైన మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. మోడీ మూడో మంత్రి వర్గంలో క్యాబినేట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసారు.  

5 /7

కుమారస్వామి కర్ణాటకకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీ(ఎస్)నేత కుమారస్వామి తొలిసారి నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

6 /7

జితన్ రామ్ మాంఝీ బిహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ ..హిందూస్థాని అవామీ మోర్చా నాయకుడు ..నరేంద్ర మోడీ 3.Oలో కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

7 /7

సర్భానంద్ సోనేవాల్ సర్బానంద్ సోనేవాల్.. గతంలో అస్సామ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఈయన నరేంద్ర మోడీ క్యాబినేట్ లో మరోసారి క్యాబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.