Add Zee Business As A Preferred Source
App

Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?

Written ByRenuka Godugu
Published: Oct 03, 2024, 08:14 PM IST|Updated: Oct 03, 2024, 08:14 PM IST

Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్‌ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్‌ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి. అయితే, నవరాత్రల్లో రెండో రోజు 4వ తేదీ శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
 

Alankaran1/5

అలంకరణ

నవ రాత్రుల్లో మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. నేడు గురువారం అమ్మవారి అలంకరణ. అయితే, రెండో రోజు గాయత్రీ దేవి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో పూజిస్తారు.  

Ashwija3/5

ఆశ్వీయుజ

రెండో రోజు ఆశ్వీయుజ విదియ రోజున గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రీ అమ్మవారి అలంకరణలను పరిగణలోకి తీసుకుంటారు.  

Friday4/5

శుక్రవారం

4వ తేదీ శుక్రవారం గాయత్రీ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని తామరపూలు, కలువపూలతో ప్రత్యేకంగా పూజిస్తారు. కనకాంబరం రంగు చీరను అమ్మవారికి సమర్పిస్తారు. ఈరోజు గాయత్రీ మంత్రి పటించాలి. ప్రసాదంగా అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను పెడతారు.  

Gayatri5/5

గాయత్రీ

ఈరోజు గాయత్రీ మంత్రాన్ని పటిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పూజ చేయడం వల్ల శత్రుపీడ నశిస్తుంది. అంతేకాదు ఈరోజు అమ్మవారి పేరు మీదుగా ఎర్రటి గాజులను దానంగా ఇవ్వాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)