NBK: 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ, జనసేనలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మరోవైపు టీడీపీ నేత బాలయ్య.. మూడోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బాలయ్యను సినీ ఇండస్ట్రీకి చెందిన వివిధ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలియజేసారు.
NBK: హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటితో హాట్రిక్ విజయం నమోదు చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి,తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను కలిసి అభినందనలు తెలియజేసారు.
అంతేకాదు నందమూరి బాలకృష్ణ నటుడిగా మరికొన్ని రోజుల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలున్నాయి. అంతేకాదు బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ గా ఎంతోమందికి సేవలందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందున్నారు.
60 యేళ్ల పై పడిన వయసులో హాట్రిక్ విజయాలు సాధించారు.వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డారు. అంతేకాకుండా హిందూపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ లీడర్ అనిపించుకున్నారు.
నందమూరి బాలయ్య ప్రజలకు ఎన్నో విధాలుగా ఎంతో సేవ చేస్తున్నారు.2024 లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన శ్రీ నందమూరి బాలకృష్ణ కి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు.
బాలయ్యను అభినందించిన వారిలో తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ , మరియు ఈసీ మెంబర్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులైన వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) అభినందించిన వారిలో ఉన్నారు. అటు తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. అనుపం రెడ్డి మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి.. బాలకృష్ణను అభినందించిన వారిలో ఉన్నారు.