Guava: పండు పండు జామ పండు.. ఆరోగ్యాన్ని పెంచే అద్భుతమైన పండు

Guava Health Benefits: పండ్లలో జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సరదాగా తినే పండు జామ. జామకాయ పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి. జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

1 /9

జామపండు ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. గ్రామీణ ప్రాంతాలు.. మార్కెట్లలో జామ అందుబాటులో ఉంటుంది. పైగా చాలా తక్కువ ధరకే లభించే పండు ఇది.

2 /9

జామపండులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి.. గాయం మానడంలో సహాయపడుతుంది. జామపండులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి.

3 /9

జామ పండు తింటే జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

4 /9

జామపండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా జామ పండును తినాలి.

5 /9

జామ పండులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటివలన రక్తపోటు, కొవ్వును తగ్గించడంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జామ మధుమేహ రోగులకు మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

6 /9

చర్మ సంరక్షణకు కూడా జామపండు దోహదం చేస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్ సీతో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

7 /9

జామపండు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

8 /9

జామపండులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కూడా ఉన్నాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

9 /9

జామపండులో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జామపండు తినడంతో దానిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తగ్గుతాయి.