NICL 2024: ఇన్సూరెన్స్‌ సంస్థలో ఉద్యోగాల జాతర.. డిగ్రీ ఉంటే చాలు ఇలా సింపుల్‌గా అప్లై చేయండి

NICL Recruitment 2024: ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి నిరుద్యోగులకు తీపి కబురు అందింది. కేవలం డిగ్రీ పట్టా ఉంటే చాలు ఉద్యోగం పొందవచ్చు. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (NICL) 500 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ nationalinsurance.nic.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
 

1 /5

ఎన్‌ఐసీఎల్‌కు దరఖాస్తు చేసుకునేవారు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదువుకోవాలి. నవంబర 11 లోపు ఈ దరఖాస్తులు చేపట్టనున్నారు. ఈ పోస్టులకు పరీక్షలు నవంబర్‌ 30, డిసెంబర్‌ 28 రెండు దశలలో నిర్వహిస్తారు. ఎన్‌ఐసీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఇతర వివరాలు తెలుసుకుందాం.  

2 /5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 21 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి స్థానిక భాషపై పరీక్ష నిర్వహిస్తారు.  

3 /5

ఎన్‌ఐసీఎల్‌కు దరఖాస్తు చేసుకునే విధానం.. అధికారిక వెబ్‌సైట్‌ nationalinsurance.nic.co.in ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ' అప్లై ఆన్‌లైన్‌' లింక్‌పై క్లిక్‌ చేయాలి అప్లికేషన్‌లో మీ వివరాలను నమోదు చేయండి, కావాల్సిన పత్రాలను కూడా అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి కాపీ ప్రింట్‌ తీసి పెట్టుకోవాలి.  

4 /5

ఎన్‌ఐసీఎల్ ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 21 పోస్టులు కేటాయించారు. తెలుగు భాషపై పట్టు ఉండాలి. ఇందులో అన్‌రిజర్వ్‌డ 10 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ 2, ఓబీసీ-7, ఎస్టీ-2 కేటాయించారు.  

5 /5

తెలంగాణకు మొత్తం 12 పోస్టులను కేటాయించారు. అన్‌రిజర్వ్‌డ్‌ 5, ఎస్సీ, ఎస్టీ ఒక్కోటి, ఈడబ్ల్యూసీ ఒక్క పోస్ట్‌, ఓబీసీ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.