Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ మూవీపై నిధి అగర్వాల్ ఆశలు.. అమ్మడి ఆశలు ఫలించేనా.. !

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా  పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్  భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.

1 /6

నిధి అగర్వాల్.. హిందీ చిత్ర సీమలో  టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది.    

2 /6

టాలీవుడ్ లో  చందూ మొండేటి దర్శకత్వంలో  అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్. 

3 /6

నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా దూకుడు మీదుంది. ముఖ్యంగా తమిళ అభిమానులతో నిధికి గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

4 /6

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఈమె కెరీర్  ఛేంజ్ అయింది.  

5 /6

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పలకరించబోతుంది  నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

6 /6

అటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె ప్రధాన కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై   ఈ అమ్మడు భారీ అంచనాలే పెంచుకుంది.