Niharika Konidela: కాఫీ షాప్ లో పని చేసిన నిహారిక కొణిదెల.. జీతం ఎంతో తెలుసా?

Niharika Konidela Job: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల ప్రేక్షకులకి ఒక హీరోయిన్ గా నిర్మాతగా మాత్రమే తెలుసు. కానీ సినిమాల్లోకి రాక ముందు ఆమె కాఫీ షాప్ లో పనిచేసేదట. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కూతురు, నాగబాబు కూతురు అయిన నిహారిక కొణిదెలా సరదాగా ఒక కాఫీ షాప్ లో పనిచేసిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు ఆమె అందుకున్న జీతం గురించి చెప్పింది ఈ భామ.

1 /5

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదల ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా.. నిర్మాతగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందు కూడా నిహారిక ఒక ఉద్యోగం చేసేదట. చిన్నప్పటి నుంచి ఈ సినిమాల మధ్యనే పెరిగిన నిహారిక ఒక కాఫీ షాప్ లో పని చేసేదట.   

2 /5

తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ నిహారిక అభిమానులు తన గురించి గూగుల్ లో ఎక్కువగా వెతికే ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. అందులో ఒక ప్రశ్న నిహారిక మొదటి రెమ్యూనరేషన్ ఎంత అని ఉంది. దానికి నిహారిక వెంటనే వారానికి వెయ్యి రూపాయలు అని జవాబు ఇచ్చింది.   

3 /5

"నేను హైదరాబాద్ లోని క్యాఫే లాటే లో పనిచేసేదాన్ని. అప్పుడు నాకు వారానికి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అది రెమ్యునరేషన్ కాదు జీతం" అని జవాబు ఇచ్చింది నిహారిక. అయితే అసలు కాఫీ షాప్ లో ఎందుకు పని చేసే వాళ్ళు అని అడగగా నిహారిక ఊరికే ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పింది.   

4 /5

నిహారిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు నిహారిక అంటే అందరికీ తెలుసు కాబట్టి ఆమె బయటకు వస్తే గుర్తుపడతారు. కానీ సినిమాల్లోకి రాక ముందు కాబట్టి ఆమె గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. ఏదేమైనా అలా తన మొదటి జీతం గురించి వివరాలు పంచుకుంది నిహారిక.

5 /5

ఇక గత కొద్ది రోజులుగా మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న నిహారిక నటనకి దూరంగా ఉన్నా.. నిర్మాతగా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మధ్యనే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. మరోవైపు ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.