Srisailam Temple: శ్రీశైలం ఆలయానికి కాసుల గళగళ.. 20 రోజుల్లో భారీగా ఆదాయం

Srisailam Temple Receives Huge Income: నల్లమల్ల కొండల్లో కొలువైన శ్రీశైలం మల్లన్నస్వామికి భారీగా ఆదాయం లభించింది. భారీ వరదతో ప్రాజెక్టు గేట్లు అన్ని తెరవడంతో భక్తులు, పర్యాటకులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో శ్రీగిరి కొండలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే 20 రోజులకు సంబంధించి హుండీ ఆదాయం లెక్కించగా భారిగా వచ్చింది.

1 /8

Srisailam Hundi Income: శ్రీశైలం ఆలయానికి భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం సందర్శించారు.

2 /8

Srisailam Hundi Income: శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.

3 /8

Srisailam Hundi Income: 20 రోజుల (ఈనెల 2వ తేదీ నుంచి 22 వరకు)కు సంబంధించిన ఆలయ హుండీల ఆదాయాన్ని లెక్కించారు.

4 /8

Srisailam Hundi Income: హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,22, 53, 862/ నగదు లభించింది.

5 /8

Srisailam Hundi Income: హుండీ ఆదాయంలో బంగారు, వెండి ఆభరణాలు కూడా వచ్చాయి. 150 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి వచ్చింది.

6 /8

Srisailam Hundi Income: ఇక విదేశీ కరెన్సీ కూడా భారీగా వచ్చింది. మొత్తం 746 విదేశీ కరెన్సీ లభించింది. 125 కెనడా, 70 అమెరికా డాలర్లు, 20 యూరోలు, ఒక మలేషియా రింగిట్స్ యుకె పౌండ్స్, 26 సింగపూర్ డాలర్లు, 50 యూఏఈ ధిర్హామ్స్‌, 3 రియాల్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు హుండీల లెక్కింపులో లభించాయి.

7 /8

Srisailam Hundi Income: పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో హుండీ లెక్కింపు చేపట్టారు.

8 /8

Srisailam Hundi Income: త్వరలోనే దసరా ఉత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. దీని కోసం ఆలయ పాలకమండలి పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.