Nithya Menen: ఓర్నీ.. తమిళ హీరోతో పెళ్లికి రెడీ అయిపోయిన నిత్యా మీనన్..?.. అంత జరిగిందా..?..


Nithya menen Wedding Rumours: టాలీవుడ్ నటి నిత్య మీనన్ తరచుగా వార్తలలో ఉంటారు. అప్పట్లో నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ నిత్య మీనన్ ను ఆడిపోసుకున్న విషయం తెలిసిందే. 

1 /8

నిత్య  మీనన్ తెలుగు, కన్నడ, మళయాళ సినిమాల్లో నటిస్తున్నారు . తన అందంతో పాటు , మెస్మరైజింగ్ నటనతో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఆమె మంచి గాయనిగా కూడా అనేక చిత్రాల్లో పాటలు పాడినట్లు తెలుస్తొంది. 

2 /8

అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగులో వెండితెరకు పరిచయం అయ్యారు . ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు.  అలా మొదలైంది తర్వాత సెగ, ఇష్క్ లో నటించారు. ఇష్క్ సినిమా హిట్ ఇచ్చింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.  

3 /8

దీంతో వీరిద్దరు హిట్ పెయిర్ గా ఆడియన్స్ దగ్గర మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. దీనితో పాటు గీత గోవిందం, ప్రాణ, జనతా గ్యారేజ్ తదితర చిత్రాలలో నటించి ఔరా అనిపించుకున్నారు.  

4 /8

ప్రస్తుతం నిత్య మీనన్.. జయంరవితో కలిసి.. కాదలిక్క నెరమిల్లై సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. నిత్య మీనన్ కు గతంలో గార్గి మూవీకి గాను ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది.  

5 /8

ఇదిలా ఉండగా.. నిత్యమీనన్ పాండియన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అదే విధంగా గోల్డెన్ వీసా లోను నటిస్తున్నారు.  దీనితో పాటు ధనుష్ సరసన ఇడ్లీ కడై లో కూడా నటిస్తున్నారు.  దీంతో సాయి పల్లవిని కాదని, నిత్యమీనన్ కు అవార్డు ఇవ్వడంతో సాయి పల్లవి ఫ్యాన్స్ నిత్య మీనన్ ను ట్రోల్స్ చేశారు. ఆమెకంత సీన్ లేదని, సాయి పల్లవి అంతకన్న బాగా చేశారని అప్పట్లో పెద్ద రచ్చే చేశారు.

6 /8

ఇదిలా ఉండగా.. తాజాగా .. నిత్యమీనన్..తనకు 70 వ చలన చిత్ర వేడుకల్లో జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎప్పుడు ఇలా అవార్డువస్తుందని అనుకొలేదని చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ కొన్ని ఆఫర్ లు వచ్చిన కూడా నో చెప్పానని, చిన్న సినిమాలు అయిన తనకు పాత్ర నచ్చితే ఓకె చెప్తానని నిత్య అన్నారు.  

7 /8

నిత్య గతంలో ధనుష్ హీరోగా, నిత్యమేనన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తిరులో నటించారు. అప్పటి నుంచి వీరు మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొవచ్చారు. తాజాగా, నిత్య మీనన్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

8 /8

ఆమె తమిళ హీరోతో పెళ్లికి సిద్దమైనట్లు తెలుస్తొంది. అతి తొందరలోనే వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వస్తున్నాయి. అయితే.. దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం కన్పించడంలేదు. ఇటీవల కాలంలో కొంత మంది పనిగట్టుకుని ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని నెటిజన్ ల మీద ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)