Nizam Highest Pre Release Business Movies: తెలంగాణలో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్.. ‘గేమ్ ఛేంజర్’ ప్లేస్ ఎక్కడంటే..

Nizam Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ మూవీతో   తెలుగు సినిమా రేంజ్ గ్లోబల్ లెవల్ కి పెరిగింది.  ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు..  ప్యాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ నైజాంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో నైజాంలో గత కొన్నేళ్లుగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..

1 /10

ప్రస్తుతం తెలుగు సినిమాల బిజినెస్ రేంజ్ పెరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నైజాం ఏరియాలో కలెక్షన్స్ అందరి హీరోలకు ముఖ్యమనే చెప్పాలి. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు ఉండటంతో హీరోలు కూడా నైజాం ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ కలెక్షన్స్ పై దృష్టి సారించారు.

2 /10

పుష్ప 2 ది రూల్ .. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా   తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా తెలంగాణలో అత్యధిక రూ. 100 కోట్ల అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్  చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు చేసిన బిజినెస్ ను రికవరీ చేసి  రికార్డు క్రియేట్ చేసింది

3 /10

RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్  హీరోలుగా  రాజమౌళి డైరెక్షన్ లో  తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ముందు వరకు  రికార్డు స్థాయిలో నైజాంలో రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ 2లో ఉంది.  

4 /10

కల్కి 2898 AD.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో   తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం తెలంగాణలో రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ 3లో ఉంది.

5 /10

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్..  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ సినిమా తెలంగాణలో రూ. 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఓవరాల్ గా టాప్ 4లో నిలిచింది.

6 /10

ఆదిపురుష్.. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ  చిత్రం తెలంగాణలో అత్యధికంగా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి టాప్ 5లో నిలిచింది.  

7 /10

దేవర పార్ట్ -1.. ఎన్టీఆర్ హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ -1’. ఈ చిత్రం  తెలంగాణ (నైజాం)లో రూ. 44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా నైజాంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల్లో టాప్ 6లో నిలిచింది. 

8 /10

గేమ్ చేంజర్.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా తెలంగాణలో రూ. 43.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 7లో నిలిచింది.

9 /10

గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా నైజాంలో రూ. 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 8లో నిలిచింది.

10 /10

బాహుబలి 2 - సాహో.. అటు బాహుబలి 2, సాహో చిత్రాలు నైజాంలో  రూ. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఔరా టాప్ 9లో నిలిచింది. మొత్తంగా టాప్ 10లో నైజాంలో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రాల్లో ప్రభాస్ వే ఎక్కువగా ఉన్నాయి.