Nothing Phone 3 Pro Launch Date: త్వరలోనే మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.55 వేలకే విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Nothing Phone 3 Pro Launch Date: భారత మార్కెట్‌లోకి త్వరలోనే నథింగ్ ఫోన్ 3 విడుదల కాబోతోంది. ఇది ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనిని కంపెనీ వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన కొత్త ఫీచర్స్‌తో రాబోతోంది. అలాగే ఇది ప్రత్యేకమైన AI స్పెషిఫికేషన్స్‌తో లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే నథింగ్ సీఈఓ కార్ల్ వెల్లడించనున్నారు.
ఈ నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 2025 సంవత్సరంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో టాప్-ఎండ్ మోడల్ ప్రో వేరియంట్‌లో విడుదల కానుంది. ఇది అద్భుతమైన స్పెషిఫికేషన్స్, ఫీచర్స్‌తో రానుంది.
నథింగ్ ఫోన్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.67-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. ఇది 12GB LPDDR5 ర్యామ్‌తో పాటు 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతోంది. దీని వల్ల సులభంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అలాగే NothingOS 3.0 పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే దీని ధర కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే లీక్ అయిన వివరాల ప్రకారం.. దీని ధర రూ.50 వేల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.
నథింగ్ ఫోన్ 3 ప్రో వేరియంట్ ధర రూ.55 వేల నుంచి లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని 2025 సంవత్సరంలో రెండవ నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ప్రకటన త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.