Numaish 2025 Postponed: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే నాంపల్లీ ఎగ్జిబిషన్ వాయిదా పడింది. జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 2025 మళ్లి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్‌ను ఈ ఏడాది కాస్త పోస్ట్ పోన్ చేశారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాపదినాలు 7 రోజులు కొనసాగడంతో నుమాయిష్ ప్రారంభం వాయిదా పడింది.
జనవరి 3వ తేదీ సీఎం రేవంత్ రెడ్డి ఈ 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 2025 ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభావకర్,టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా గెస్టులుగా రానున్నారు ఇక రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
45 రోజులపాటు నిర్వహించే నుమాయిష్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి ప్రకటించారు. దేశ నలుమూలల నుంచి ట్రేడర్లు ఇక్కడ ఎగ్జిబిషన్ లో పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. తమ రాష్ట్రాలకు చెందిన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
ఈ హైదరాబాద్ ఐకానిక్ ఎగ్జిబిషన్‌ను నుమాయిష్ అని కూడా పిలుస్తారు. గత 85 ఏళ్లుగా కొన్ని లక్షల మంది ఈ 45 రోజులుపాటు ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఈ నుమాయిష్‌లో 2 వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇది ప్రతి ఏడాది హైదరాబాద్ నాంపల్లి రోడ్డులో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది.
ప్రతి ఏడాది జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతుంది. స్టాళ్ల కేటాయింపులు కూడా తుదిదశకు చేరాయి. ఎగ్జిబిషన్‌కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నుమాయిష్‌కు కేవలం హైదరాబాబాదీలు మాత్రమే కాకుండా వివిధ జిల్లాల్లో నుంచి కూడా వస్తారు.