Vegitables prices: బాబోయ్‌ ఇవేం ధరలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. తాట తీస్తున్న టమాటా..


Onions and tomatoes hike: కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. డిమాండ్ కు సరిపడా.. సప్లై లేకపోవడం వల్ల అన్నిరకాల కూరగాయల ధరలు అమాంతం కొండెక్కాయి.

1 /6

దేశంలో ఎలాంటి మార్పువచ్చిన ముందుగా ఎఫెక్ట్ అయ్యేది పేద, మధ్యతరగతి ప్రజలు.  నిత్యవసరాల ధరలు , కూరగాయల అనేవి మనిషికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు. ఈ నేపథ్యంలో.. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వీటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతారు.

2 /6

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో మార్కెట్ లో కూరగాయల ధరలు అమాంతంపెరిగి పోయాయి. డిమాండ్ కు కావాల్సిన సప్లై లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇక వర్షాల వల్ల కొన్ని పంటలు పాడైపోయినట్లు సమాచారం.

3 /6

ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయలు ఆడవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయలు, టమాటాలు అనేది లేనిది ఏది కూడా వండటానికి సాధ్యపడదని చెప్పుకొవచ్చు, పప్పు, సాంబారు, చట్నీలు, ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఉల్లిపాయ, టమాటాలు ఉండాల్సిందే.

4 /6

టమాటాలు, ఉల్లిపాయలు లేకుండా ఏది వండిన కూడా అంతగా టెస్టు రాదు. ఇక బ్యాచీలర్స్ కు ఉల్లిపాయలు, టమాటాలు ఉంటే పండగ చేసుకుంటారు. వీటితో బోలేడు రకాల కర్రీలు, చట్నీలు చేసుకుంటారు. వీటితో కర్రీలు చేయడం కూడా ఎంతో ఈజీ. 

5 /6

దీంతో ఇటీవల హైదరాబాద్ లో అనేక చోట్ల ఉల్లిధరలు, టమాటాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రెండు వారాల క్రితం.. టమాటా కేజీ ధర 30 ఉండగా.. ఇప్పుడు 60 కి చేరింది. ఇక ఉల్లి ధరలు.. కిలోకి 40 ఉండగా.. ఇప్పుడు 80 కు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో కేజీ ఉల్లిపాయలను 100 రూపాయలకు కూడా అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

6 /6

రైతులు తమ పొలాల్లో ఇప్పుడు టమాట పంట వేశారు. అవి రెండునెలల్లో అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇక ఉల్లిపాయలను ఇతర రాష్ట్రాల  నుంచి దిగుమతులకుకూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తొంది. దీంతో ఒక నెలలో కొండెక్కిన కూరగాయల ధరలు దిగోస్తాయని తెలుస్తోంది. అప్పటిదాక ..ఈ కూర గాయాల దెబ్బలు భరించక తప్పదని సమాచారం.