Kasturi Shankar: అల్లు అర్జున్ ఘటనపై డిప్యూటీ సీఎం రియాక్షన్.. సంచలన ట్విట్ చేసిన నటి కస్తూరీ శంకర్.. ఏమన్నారంటే..?

Actress Kasturi Shankar: నటికస్తూరీ శంకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది కాస్త వార్తలలో నిలిచింది.
 

1 /6

పవన్ కళ్యాణ్ తాజాగా.. చిట్ చాట్ లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప2 థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధకరమన్నారు.  

2 /6

రేవతి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇదే నేపథ్యంలో రేవంత్ హీరో కాబట్టి.. మరో హీరోను అరెస్ట్ చేయగలిగాడన్నారు. శ్రీతేజ్ తొందరగా కొలుకొవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

3 /6

రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో తప్పేమిలేదని అంటునే.. బన్నీ లేదా పుష్ప2 మూవీ యూనిట్ ఘటన జరగ్గానే కరెక్ట్ గా స్పందిస్తే... ఇంత దూరం వచ్చేది కాదన్నారు.  

4 /6

చట్టం ముందు అందరం సమానమే అంటూ కూడా రేవంత్ పాలనను ప్రశంసించారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, రాజకీయంగా కూడా కాకరేపుతున్నాయి.

5 /6

ఈ నేపథ్యంలో నటి కస్తూరీ శంకర్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పవన్ కళ్యాణ్ నిజమైన పెద్ద మనిషిలా వ్యవహరించారన్నారు. చాలా మెచ్చుర్డ్ గా మాట్లాడారన్నారు. ఎక్కడ కూడా వన్ సైడ్ తీసుకున్నట్లు మాట్లాడలేదన్నారు.

6 /6

అదే విధంగా నటి కస్తూరీ ఈ విషాదాలన్ని మర్చిపోయి.. కొత్త ఆశలతో కొత్త ఏడాది 2025కి ఆనందంగా స్వాగతం పలుకుదామని కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నటి కస్తూరీ వ్యాఖ్యలు మాత్రం వార్తలలో నిలిచాయి.