Pushpa 2 Ticket Price in AP: పుష్ప -2 డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టికెట్ ధరల పెంపు పై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా.. కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పుష్ప సినిమాకి ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో భారీ స్ధాయిలో టికెట్ అమ్మకాలను కూడా నమోదు చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ పెంపుకి ఆమోదం అందుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపుకు ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు.
దీంతో కొత్త అనుమానాలకు దారితీస్తోంది . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుష్ప -2 టికెట్ పెంపు పై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇటీవల ఆయన ఎన్టీఆర్ దేవర సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయబోతున్న సమయంలో.. టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు.
చాలా గ్యాప్ తర్వాత సింగిల్ స్క్రీన్ లలో రూ.110 మల్టీప్లెక్స్ లలో రూ.135 పెంపుతో పాటు రోజుకు ఆరు షోలను అనుమతించడంతో దేవర సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప -2 కోసం దేవర సినిమాకి ఇచ్చిన పెంపును ఇవ్వబోతున్నట్లు లోపల వార్తలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మేకర్స్ 300 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం ఈ పెంపుకి అనుమతి ఇవ్వలేదు.
మరొకవైపు తెలంగాణలో ప్రీమియర్ షోల టికెట్ ధర రూ .1000 కంటే ఎక్కువ ఉండడంతో..ఇక్కడ కూడా నిర్మాతలు రికార్డు స్థాయిలో ధరలు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంపై నిర్మాతలతో పాటు అల్లు అర్జున్ కూడా సన్నిహిత వర్గాల నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ ఒకవేళ ధరలు పెంచితే మాత్రం ప్రజలపై భారం పడుతుందనడంలో సందేహం లేదు. మరి ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టికెట్ ధరల పెంపు పై నిర్ణయం తీసుకుంటారో చూడాలి