Peanuts Benefits: మధుమేహం వ్యాధిగ్రస్థులు వేరుశెనగ తినవచ్చా లేదా

డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ కొన్ని సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి. ముఖ్యంగా వేరుశెనగ తినవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Peanuts Benefits: డయాబెటిస్ రోగులకు ఎప్పుడూ కొన్ని సందేహాలుంటాయి. ఎలాంటి ఆహారం తినవచ్చు, ఎలాంటి ఆహారం తినకూడదనే ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మధుమేహంలో కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి వెలుగు తగ్గడం వంటి ప్రమాదాలుంటాయి. ముఖ్యంగా వేరుశెనగ తినవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

అధిక బరువుకు చెక్ డయాబెటిస్ రోగులకు స్థూలకాయం అతిపెద్ద సమస్యగా ఉంటుంది. వేరు శెనగ తినడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 /5

శరీరానికి హెల్తీ ఫ్యాట్ వేరుశెనగను పేదల బాదంగా చెప్పవచ్చు. హెల్తీ ఫ్యాట్‌కు రిచ్ సోర్స్ ఇది. ఇది తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

3 /5

మధుమేహ వ్యాధిగ్రస్థులు వేరుశెనగ తినవచ్చా బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఉదయం వేళ వేరుశెనగ తింటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. పీనట్ బటర్‌లో మెగ్నీషియం మధుమేహానికి ఉపయోగకరం.

4 /5

కొలెస్ట్రాల్‌కు చెక్ వేరుశెనగ తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరుశెనగ తినాల్సి ఉంటుంది. 

5 /5

వేరుశెనగలో ఉండే న్యూట్రియంట్లు వేరుశెనగను అత్యంత పౌష్టికాహారంగా చెప్పవచ్చు. ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి కాంప్లెక్స్, ప్యాంటోథెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.