Cast Census: తెలంగాణలో కులగణన.. ఇంట్లో మర్చిపోకుండా రెడీగా ఉంచుకోవాల్సిన పత్రాలు ఇవే..

Telangana kula ganana: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కులగణనకు అన్నిరకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తొంది.  ప్రతి ఇంటికి కొంతమంది అధికారులు వచ్చి కుటుంబ సభ్యులకు చెందిన వివరాలు నమోదు చేసుకుంటారని తెలుస్తొంది.
 

1 /8

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి అధికారులకు ఇంటింటికి సర్వేలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  

2 /8

దీనిలో భాగంగా.. సామాజిక, ఆర్థిక, విద్య, కులాలు, ఉపాధి అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.  

3 /8

సర్వేలో దాదాపు.. 75 ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మెయిన్ గా 56 ప్రశ్నలు ఉండగా.. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయని సమాచారం.

4 /8

అదే విధంగా ఈ ప్రశ్నలు రెండు పార్టులుగా ఉంటాయి. పార్టు-1లో.. కుటుంబ యజమాని పేరు,ప్యామీ సభ్యులు  వ్యక్తిగత వివరాలు, ఎక్కడ చదువుకున్నారు. భూములు, రిజర్వేషన్లు, రాజకీయాల్లో పోటీ చేశారో అన్న విధంగా కూడా ప్రశ్నలు ఉంటాయి.  

5 /8

పార్టు-2లో .. దీనిలో మొత్తంగా 17 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 7 ప్రధాన ప్రశ్నలు కాగా, మిగతావి అనుబంధ ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. భూములు వివరాలు.. ధరణిలో నమోదైన పట్టానంబర్, భూములు ఎలా సంక్రమించాయి వంటి అంశాలు ఉంటాయి.  

6 /8

విద్య, జాబ్ లు రిజర్వేషన్ లు, ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏమైన లబ్ధిపొందారా అన్న వివరాలు ఉంటాయి. గతంలో రాజకీయల్లో పోటీకీ దిగారా అన్న అంశాలు కూడా ఉంటాయి.  

7 /8

ఇతర దేశాలకు వెళ్లారా.. ఉద్యోగం మొదలైన వివరాలు కూడా ఉంటాయంట. సర్వేల సమయంలో ఫొటోలు, పత్రాలు తీసుకోరు.  కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న సమాచారం  గోప్యంగా ఉంచుతారు.  

8 /8

పెళ్లి, దివ్యాంగులు, పశుసంపద, రేషన్ కార్డులు, తాగునీరు మొదలైన అంశాలు దీనిలో ఉంటాయని తెలుస్తోంది. ఈ సర్వే ద్వారా తెలంగాణ ప్రభుత్వం కుటుంబం వారి పరిస్థితుల గురించి సర్కారుకు ఒక అవగాహనకై ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది.