Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్‌..

Pension Scheme for Laborers: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వస్తుంది. ఇందులో ఎక్కువ శాతం సామాన్యులకు లబ్ది కలిగించేవే అధికం. అసంఘటిత కార్మికులకు అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం బంపర్‌ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇలా చేస్తే వారికి కూడా నెలకు రూ.3000 పొందే సూపర్‌ హిట్‌ స్కీమ్‌ ఇది..
 

1 /7

పింఛను అనేది రిటైర్‌ అయినా ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తాయి. ఇవి వారి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయి. అయితే, ఉద్యోగుల సంగతి పక్కన పెడితే అసంఘటిత కార్మికుల సంగతి ఏంటి? అలాంటి వారి కోసం కేంద్రం ఓ సూపర్‌ హిట్‌ స్కీమ్‌ ప్రారంభించింది.  

2 /7

మన దేశంలో అసంఘటిత శ్రామికుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంది అటువంటి వారి కోసం కేంద్రం పింఛను పథకాన్ని ప్రారంభించింది. ప్రతిరోజు కూలీ పనులు చేసేవారికి ఇది ఎంతో లాభదాయకమైన స్కీమ్‌. వృద్ధాప్యంలో చేయూతను అందిస్తుంది. వీరు పనిచేస్తున్న అన్ని రోజులు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు ఆ తర్వాత వీరికి అంటూ ఏ ఆదాయం ఉండదు.  

3 /7

రిటైర్మెంట్ తర్వాత వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. వీరి కోసం పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 'ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్‌దన్‌ యోజన' ప్రారంభించారు. ఇది అనార్గనైజ్‌ సెక్టార్‌లో పనిచేసేవారికి ఎంతగానో ఉపయోగకరం. ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించారు.  

4 /7

ఈ పథకంలో చేరితే ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌ పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయస్సువారు అర్హులు. వీరు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే 60 ఏళ్ల నుంచి ప్రతినెలా రూ.3000 పింఛను అందుకుంటారు. ఇందులో కనీసం 20 ఏళ్లు అయినా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.  

5 /7

ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ పథకంలో చేరాలంటే ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ కలిగి ఉండాలి. మీ బ్యాంకు ఖాతాకు మొబైల్‌ నంబర్‌ కూడా లింక్‌ అయి ఉండాలి.  

6 /7

ఈ పథకం ప్రారంభించినప్పుడు మొదటి ప్రీమియం క్యాష్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెలా డెబిట్‌ అవుతూ ఉంటాయి. ఈ పథకంలో ప్రతి నెలా రూ. 55 నుంచి 200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పథకంలో 10 కోట్లకు మందికిపైగా చేరారు.  

7 /7

ఈ డిపాజిట్ ఎల్‌ఐసీ లో చేయాల్సి ఉంటుంది. అసంఘటిత కార్మికులు రిటైర్‌ అయిన తర్వాత ఎవరిపై ఆధార పడకుండా ఈ స్కీమ్‌ ప్రారంభించింది కేంద్రం. ఒకవేళ అతను మరణిస్తే పింఛను సగం అంటే రూ.1500 ప్రతినెలా భార్య అందుకుంటుంది.