67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అందించిన ఫోటోలను చూడండి
ఘనంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు..ధనుష్, ఉత్తమ నటుడుగా.. తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకి అవార్డులు దక్కాయి.
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తమిళ నటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. (Pic Credit: ANI)
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకు గాను కంగనా రనౌత్‌కు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉత్తమ నటి అవార్డును అందజేశారు. (Pic Credit: ANI)
'అసురన్' చిత్రానికి గాను తమిళ హీరో ధనుష్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. అవార్డును అందజేసిన ఉపాద రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Pic Credit: Twitter)
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో 'భోంస్లే' చిత్రానికి గాను మనోజ్ బాజ్‌పేయికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉత్తమ నటుడి అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. (Pic Credit: ANI)
2021 జాతీయ చలనచిత్ర పురస్కారాలలో సూపర్ స్టార్ రజనీకాంత్- మనోజ్ బాజ్‌పేయి కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. (Pic Credit: Twitter)
67 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ నటుడు ధనుష్‌తో తీసుకున్న సెల్ఫీని కంగనా రనౌత్ థన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది (Pic Credit: Instagram)