PM kisan 17th installment: మోదీప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లలో రూ. 2000 జమా..

Pm kisan 17th Installment date: నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. త్వరలోనే వారి ఖాతాల్లో రూ. 2000 చేరనున్నాయి. పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 
 

1 /5

మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటగా ఈ ఫైల్ పైనే సంతకం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త అందినట్లే అవుతుంది. పిఎం కిసాన్ సంబంధించిన ద్వారా 17వ విడత నిధుల డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో చేరనున్నాయి.  

2 /5

ఈ పథకంలో భాగంగా 9.5 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చే కూరనుంది.పీఎం కిసాన్ యోజన అంటే పేద చిన్నా రైతుల సంక్షేమ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందిస్తున్న చేయూత దీని ద్వారా ప్రతి ఏటా 6000 రూపాయలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేస్తా ఉంది.  

3 /5

పీఎం కిసాన్ యోజన ద్వారా లబ్ది పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఉండాలి. ఇంకా ఈ కేవైసీ ఆక్టివిటీ కూడా పూర్తి చేయాలి. ఏం కిసాన్ యోజన 2018 డిసెంబర్ 1న ప్రారంభించారు ఇది రైతులకు ఆదయపరంగా చేయూత ఇవ్వడానికి ప్రారంభించారు.  

4 /5

ముఖ్యంగా ఈ పథకంలో రెండు హెక్టార్ల సాగు కలిగి ఉన్నవారు అర్హులు ఈ పథకానికి నమోదు చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. www.pmkyc.in ద్వారా అప్లై చేసుకోవాలి.  

5 /5

అంటే నేరుగా రైతుల ఖాతాలో 2000 రూపాయలు జమ కానున్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )