PM Kisan Beneficiary Must Avoid: పీఎం కిసాన్ నిధులు 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 రైతుల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 పొందుతారు. 2019 నుంచి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక చేయూత అందుకుంటున్నారు. అయితే, పీఎం కిసాన్ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే డబ్బులు ఆగిపోతాయి.
ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు 18వ విడుత నిధులు రైతుల ఖాతాల్ల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పొందారు. ఇక 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ విడుత డబ్బులు మీ ఖాతాల్లో క్రెడిట్ కావాలంటే మూడు పనులు వెంటనే పూర్తి చేయండి.
పీఎం కిసాన్ యోజనలో మీ పేరు ముందుగా రిజిస్టర్ అయి ఉంటే ఇకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఒక వేళ మీరు కేవైసీ పూర్తి చేసి ఉండకపోతే వెంటనే పూర్తి చేయండి.లేకపోతే మీకు 19వ విడుత నిధులు ఆగిపోవచ్చు.
పీఎం కిసాన్ యోజనలో మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే మార్చుకోండి. లేకపోతే కూడా ఈ విడుత డబ్బులు ఆగిపోవచ్చు. అంతేకాదు రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి.
అంతేకాదు మీ బ్యాంక్‌లో డీబీటీ ద్వారా ఈ పథకం డబ్బులు క్రెడిట్ చేస్తారు. కాబట్టి డీబీటీ యాక్టివేట్ ఉందా? ముందుగానే చెక్ చేసుకోండి. 2025 అక్టోబర్ 5న 18వ విడుత నిధులు విడుదల చేశారు. ఇక 19వ విడుత ఫిబ్రవరి మొదటి వారంలో పడతాయని ఎదురు చూస్తున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చిన్నా సన్నకారు రైతులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే, ఈ పథకం బెనిఫిట్ రూ.10 వేలకు కేంద్రం పెంచవచ్చని కూడా రైతులు ఎదురు చూస్తున్నారు.