Pooja Hegde Assets: పూజా హెగ్డే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కథానాయికగా తన హవా నడిపించింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో ఈమె పై ఐరన్ లెగ్ ముద్ర వేసారు. నిన్న మొన్నటి అగ్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె ఉండేడి. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేక హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. ఐతే ఇన్నేళ్ల కెరీర్లో ఈమె తనకు వచ్చిన రెమ్యునరేషన్స్తో బాగానే కూడబెట్టినట్టు సమాచారం.
పూజా హెగ్డే తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీపం ఉండగానే ఇళ్లు చక్కబోటుకోవాలన్నట్టు కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే ఈ భామ బాగానే కూడబెట్టినట్టు సమాచారం. పూజా తమిళ సినిమా 'మూంగముడి' మూవీతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. ఈ సినిమాలో ఈమె చేసిన హాట్ షోకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత అరవింద సమేత వీరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
లాస్ట్ ఇయర్ 'రాధే శ్యామ్' మూవీతో పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరుసగా బీస్ట్, ఆచార్య, హిందీలో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్' వరుస ఫ్లాపులు ఈమె కెరీర్‌ను డైలామాలో పడేసేలా చేసింది.
వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ముందుగా ఈ భామను తీసుకొని తొలిగించారు. అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది.
ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా ఉన్న ఈ భామ తనకు వచ్చిన రెమ్యునరేషన్‌తో బాగానే కూడబెట్టినట్టు సమాచారం. ఈమె ఒక్కో సినిమాకు నిన్న మొన్నటి వరకు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
అంతేకాదు తనకు వచ్చిన పారితోషకంలోనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్రతీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుంది. మొత్తంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో అన్ని ప్రాపర్టీస్ కలిపి దాదాపు రూ. 150 కోట్ల మార్కెట్ విలువ ఉంటుందని సమాచారం. పైగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా ఈమెకు కలిసొచ్చాయట.