Happy Birthday KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి 10 ఆసక్తికర విషయాలు

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)

10 Facts About Telangana CM KCR : నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)

1 /10

Happy Birthday KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR) మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. (Photos Credit: Twitter) Also Read: Telangana సీఎం కేసీఆర్ కారణజన్ములు, KCRకు బర్త్‌డే విషెస్ తెలిపిన Harish Rao

2 /10

Telangana సీఎం కేసీఆర్ సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బీఏ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ (తెలుగు సాహిత్యం) పట్టా పొందారు.

3 /10

1969 ఏప్రిల్ 23న కేసీఆర్ వివాహం శోభతో పెద్దలు జరిపించారు. వీరికి సంతానం ఒక కుమారుడు కేటీఆర్, ఒక కుమార్తె కవిత ఉన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. Also Read: GHMC Mayor కావాల్సిన అర్హతలు చాలా మందికి ఉన్నాయి, కానీ పదవి ఒక్కరికే సాధ్యం: CM KCR

4 /10

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. కేసీఆర్ రాజకీయ గురువు అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్.

5 /10

యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న కేసీఆర్ ఆ పార్టీకి రాజీనామా చేసి, తాను ఎంతగానో అభిమానించే నటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1982లో చేరారు. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త

6 /10

1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. Also Read: EPFO: 40 లక్షల మంది EPF ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ షాకింగ్ న్యూస్

7 /10

1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్ర శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు కేసీఆర్. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆపై వరుసగా 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో సిద్ధిపేట నుంచి వరుసగా విజయాలు అందుకున్నారు. ఆపై 2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

8 /10

కేసీఆర్ 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 1997-98లో రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా మంత్రి పదవితో కేబినెట్ హోదా లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి నిర్వహించారు. Also Read: Aadhar card with Indane gas:ఆధార్ కార్డును ఇండేన్ గ్యాస్‌తో ఇలా లింక్ చేసుకోవాలి..లేదంటే సబ్సిడీ రాదు

9 /10

1999లో అప్పటి సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడంతో కేసీఆర్‌ అసంతృప్త నేత అయ్యారు. 2001 ఏప్రిల్ 21న టీడీపీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారు. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో మరికొందరితో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీని ఏర్పాటు చేశారు.

10 /10

2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్. తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 2014 జూన్ 2న సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించారు. డిసెంబర్ 13న రెండో పర్యాయం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పాలన కొనసాగిస్తారు సీఎం కేసీఆర్. Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం