Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..

Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ కాదు.. భారతీయ సినీ చరిత్రలో ఒకే ఒక్కడు .. ప్రభాస్ ఆ రికార్డుకు దరిదాపుల్లో ఎవరు లేరు.. అవును ప్రభాస్.. ఒక్కో సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ ఇంతింతై అన్నట్టు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపెడుతున్నాడు. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతన్నారు. 

1 /8

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన  మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

2 /8

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన  ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /8

ప్రభాస్  శ్రీరామ చంద్రుడిగా యాక్ట్ చేసిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /8

రాధే శ్యామ్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా ప్రపంచవ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /8

సాహో సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /8

బాహుబలి 2 ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 352 కోట్ల బిజినెస్ చేసింది. 

7 /8

ప్రభాస్ .. రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి తర్వాత తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి పార్ట్ -1. ఈ సినిమా అప్పట్లోనే రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో తొలి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  

8 /8

మొత్తంగా రెబల్ స్టార్ ప్రభాస్.. గత ఐదు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. అక్షరాల రూ. 1427.8 కోట్లు ఉంది. మొత్తంగా తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఈ రికార్డుకు దరిదాపుల్లో లేరనే చెప్పాలి.