Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు, ఐఎండీ హెచ్చరిక..

IMD Rain Alert In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గత నెలలో కూడా మూడు నాలుగు అల్పపీడనలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ఈ నెలలో కూడా అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ ముందుగానే హెచ్చరించింది.
 

1 /5

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  

2 /5

ఇది తీరం చేరే సమయానికి బలహీన పడుతోంది. దీంతో ఏపీలోకి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి రెండు రోజుల పాటు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం, నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతుంది.  

3 /5

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రత్యేకంగా నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.  

4 /5

ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్‌ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ, రాత్రుల్లో ఈ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోతుంది.   

5 /5

అయితే, నవంబర్ 11 వరకు ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.